
బెనోని (సౌతాఫ్రికా): అండర్19 వరల్డ్ కప్‌లో వరుసగా ఐదు సహా తొమ్మిదోసారి ఫైనల్ చేరిన యంగ్ ఇండియా తుదిపోరులో తన ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తోంది. ఇండియాతో టైటిల్ ఫైట్ కోసం గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇందులో నెగ్గిన జట్టు ఆదివారం టీమిండియాతో ఫైనల్లో పోటీ పడుతుంది. కాగా, ఇండియా మాదిరిగా ఆసీస్, పాక్ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా సెమీస్‌కు వచ్చాయి. దాంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే చాన్సుంది.