నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో మోహన్ బాబు అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. డిసెంబర్ 24 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు ఉండటంతో .. డిసెంబర్ 24 తర్వాత నోటీసులిచ్చి మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
మంచు మోహన్ బాబు,మనోజ్ ఫ్యామిలీ గొడవల్లో భాగంగా.. డిసెంబర్ 10 న రాత్రి జల్ పల్లిలోని ఫామ్ హౌస్ లో కవరేజ్ కు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించారు.మైకులు గుంజుకుని దాడి చేశారు. ఈ ఘటనలో జర్నలిస్టుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Also Read :- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
ఈ కేసులో మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వులకు డిసెంబర్ 19న హైకోర్టు నిరాకరించింది. అయితే.. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి(డిసెంబర్ 23, 2024) వాయిదా వేసింది. ఇవాళ విచారించిన హైకోర్టు మోహన్ బాబు ముందుస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.
మీడియాపై మోహన్ బాబు దాడి.. కెమెరాలు, మైకులు ధ్వంసం pic.twitter.com/hjMfvkSOmy
— Prashanth (@itzmibadboi) December 10, 2024