ఇయ్యాల, రేపు మరింత ఎండలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరో వైపు అనేక చోట్ల వడగాడ్పులు వీస్తున్నాయి. బుధవారం ఆదిలాబాద్‌‌‌‌లోని జైనథ్ లో 45.7 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మస్తు ఎండలు ఉండొచ్చని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది.