గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోన్న బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు 80 వేల మార్క్ ను దాటిన పసిడి రూ. 1090 తగ్గింది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ. 500 తగ్గి లక్షా 500లకు చేరింది.
నవంబర్ 25న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఒక్కసారిగా రూ.1090 తగ్గడంతో రూ. 78,850 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1000 తగ్గి రూ.72000కు చేరింది.
Also Read :- బంగాళాఖాతంలో వాయుగుండం
ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1090 తగ్గడంతో రూ.78,700 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై 1000 తగ్గి రూ. 72,150 గా ఉంది.
విశాఖ,విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78, 550 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72 వేలుగా ఉంది.