
అహ్మదాబాద్: ఓవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్.. మరోవైపు వరుసగా రెండు గెలుపులతో ఊపుమీదున్న రాజస్తాన్ రాయల్స్ కీలక పోరుకు రెడీ అయ్యాయి. బుధవారం జరిగే లీగ్ మ్యాచ్లో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం టైటాన్స్ 6 పాయింట్లతో టాప్-2లో ఉండగా, రాజస్తాన్ 4 పాయింట్లతో ఏడో ప్లేస్లో ఉంది. ఇందులో నెగ్గి పాయింట్లను మరింత మెరుగుపర్చుకోవాలని రెండు జట్లు భావి స్తున్నాయి. అయితే ఇది జరగాలంటే రెండు జట్లు బౌలింగ్ బలహీనతను అధిగమించాలి.
పేసర్ సిరా జ్, స్పిన్నర్ సాయి కిశోర్ వ్యక్తిగత పెర్ఫామెన్స్‌తోనే జీటీ విజయాలు సాధిస్తోంది. కానీ ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ వైఫల్యం జట్టును వేధిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్లోని బౌలింగ్ పిచ్‌లపై వీరిద్దరూ వికెట్లు తీయడంలో ఫెయిలయ్యారు. రషీద్ నాలుగు, ఇషాంత్ మూడు మ్యాచ్లో చెరో వికెట్ మాత్రమే తీయడం మేనే జ్మెంట్ను గందరగోళంలో పడేసింది.
ఇక అర్హద్ ఖాన్, కోయెట్జీ ఇంకా ఫిటెనెస్ అందుకోకపోవ డంతో జీటీకి బ్యాకప్ బౌలింగ్ కరువైంది. వ్యక్తిగత కారణాలతో రబాడ స్వదేశానికి వెళ్లడం కూడా జీటీ బౌలింగ్ను మరింత బలహీనంగా మార్చింది. బ్యా టింగ్లో గిల్, బట్లర్, రూథర్ఫోర్డ్. సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇక కెప్టెన్ శాంసన్, యశస్వి, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, నితీశ్ రాణాతో కూడిన రాజస్తాన్ బ్యాటింగ్ బలంగా ఉంది.
కానీ బౌలింగ్లో ఇబ్బందులు ఇంకా తొలగలేదు. పేసర్లు జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మలో నిలకడలేమి జట్టును వేధిస్తోంది. యుధ్వీర్ సింగ్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయగాడిలో పడాల్సినఅవసరం చాలా ఉంది. ఓవరాల్గా అహ్మదాబాద్ స్టేడియంలో చివరి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 243, 232, 196, 160 రన్స్ వచ్చాయి. కాబట్టి రన్స్ నిరోధించాలంటే ఇరుజట్ల బౌలర్లు శ్రమించా ల్సిన అవసరం ఉంటుంది.