నేడు( సెప్టెంబర్22) ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే

నేడు( సెప్టెంబర్22) ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే

మొహాలీ: ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిహార్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియా–ఆస్ట్రేలియా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సర్వం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది. ప్లేయర్లు, ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రికార్డుల పరంగా చూస్తే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంచనా వేయడం కష్టంగా మారినా.. స్వదేశంలో ఆడుతుండటం టీమిండియాకు కాస్త అడ్వాంటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుంది. సీనియర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా, స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది.   

ఆ ఇద్దరు ఆడాల్సిందే..

వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అత్యంత కీలకం కానుంది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకే ఒక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నట్లు సమాచారం. టీ20ల్లో చెలరేగే సూర్య వన్డేలో వరుసగా ఫెయిలవుతున్నాడు. కనీసం ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీరిద్దరు భారీ స్కోర్లు చేస్తేనే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆశించొచ్చు. ఒకవేళ ఇద్దరూ ఫెయిలైతే ఇతర ప్రత్యామ్నాయాలపై మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనుంది. శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడుగా ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోసారి చెలరేగితే భారీ స్కోరు ఖాయం. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లుగా జడేజా, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీగా అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాడు. కాబట్టి లోయర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ముగ్గురి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టి పెట్టనుంది. పేసర్లలో బుమ్రా, షమీ చెలరేగితే ఇండియా ఈజీగా విజయాన్ని అందుకోవచ్చు. కానీ ప్రత్యర్థి ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో వీళ్లపై కూడా ఒత్తిడి ఉంది. మూడో సీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకర్ని తీసుకోవచ్చు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆటను బట్టే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మనోళ్ల ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఊహించొచ్చు.  

స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన్రు..

ఇటీవల సౌతాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేజార్చుకున్న ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గాయాలు వెంటాడుతున్నాయి. గజ్జ నొప్పితో మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చీలమండ గాయంతో పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో లేరు. అయితే కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడుతుండటం కంగారూలకు బలం చేకూర్చింది. గత మార్చిలో ఇండియాపై వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదే ఫలితాన్ని రిపీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. అదే జరిగితే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కంగారూలకు ఎదురుండకపోవచ్చు. ట్రావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాయపడటంతో లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించింది. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని అతను చూస్తున్నాడు. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలించే ఇండియా పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్లకు ఎప్పుడూ సవాలే. అందుకే కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతో కొంత ప్రభావం చూపాలని భావిస్తున్నారు. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంపా నుంచి ప్రమాదం పొంచి ఉంది. 

జట్ల (అంచనా):

ఇండియా: రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడేజా, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షమీ, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బుమ్రా.
ఆస్ట్రేలియా: కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అలెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారీ, కామెరూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / తన్వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగా, ఆడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంపా, హాజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.