తండ్రి భుజంపై నుంచి జారి థార్డ్ ఫ్లోర్ నుంచి కింద పడిన పసివాడు

తండ్రి భుజాన ఉన్న  ఏడాదిన్నర బాబు చేజారి మూడు అంతస్తులపై నుంచి కింద పడ్డాడు. ఈ దుర్గటనలో ఆ పసివాడు చనిపోయాడు. ఛత్తీస్‫గడ్ రాజధాని రాయ్‌పూర్‪ లో ఓ ఫ్యామిలీ మంగళవారం సిటీ సెంటర్ మాల్ కు వెళ్లారు. తండ్రి 18 నెలల వయసున్న బాబును భుజాన ఎత్తుకున్నాడు. ఐదేళ్ల వయసున్న మరొక బాబు తండ్రి చేయి పట్టుకొని నడుస్తున్నారు. షాపింగ్‌ మాల్‌ మూడో అంతస్తులో ఎస్కలేటర్‌ వద్ద వారు ఉండగా దానిని ఎక్కేందుకు ఐదేళ్ల కుమారుడు ప్రయత్నించాడు. 

ఈక్రమంలో అతడ్ని వారించే ప్రయత్నంలో ఏడాదిన్నర వయసున్న పసి బాలుడు తండ్రి భూజంపై నుంచి జారిపోయాడు. వారు థార్ట్ ఫ్లోర్ లో ఎలివేషన్ చివర్లో ఉన్నారు. దీంతో షాపింగ్‌ మాల్‌లో చాలా ఎత్తు నుంచి బాలుడు కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాబు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ షాపింగ్‌ మాల్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ షాక్ కు గురవుతున్నారు.

ALSO READ :- పాకిస్థాన్ గ్వాదర్ పోర్ట్పై ఉగ్రదాడి..ఇద్దరు హతం