ఉచితం ఉత్తి మాటే..!

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్​లో రైతులకు, వ్యాపారస్తులకు, వినియోగదారుల కోసం ఉచితంగా వాడుకునేందుకు టాయిలెట్స్​ను ఏర్పాటు చేశారు. మెయింటనన్స్​కోసం మార్కెట్​కమిటీ నిధులు మంజూరు చేస్తున్నా, సదరు కాంట్రాక్టర్ ఓ మనిషిని ఏర్పాటు చేసి అక్కడకు వచ్చే వారి వద్ద రోజూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ ఆఫీసర్లు సమస్య పరిష్కరించాలని వ్యాపారస్తులు, రైతులు కోరుతున్నారు.