జపాన్లో వారానికి నాలుగు రోజులే పనిదినాలు..ఎందుకో తెలుసా?

జపాన్లో వారానికి నాలుగు రోజులే పనిదినాలు..ఎందుకో తెలుసా?

జపాన్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో జనాభా సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ సమస్యను అధిగమించేందుకు జపాన ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. తగ్గుతున్న జననాల రేటు, పెరుగుతున్న వృద్దుల సమస్యను పరిష్కరించేందుకు ఆ దేశ ప్రజలకు రాయితీలు, హామీలు ఇస్తోంది. ఏకంగా చట్టసభల్లో కీలక నిర్ణయాలు చేస్తోంది.   

జపాన్లో జనాభా సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే 5.7 శాతం జననాలు రేటు తగ్గింది. సగటు జాతీయ సంతానోత్పత్తి రేటు ఒక స్త్రీకి 1.2గా ఉంది..స్థిరమైన జనాభా ఉండాలంటే.. ఈ రేటు 2.1కంటే ఎక్కువగా ఉండాలి. ఇక టోక్యో ఈ గణాంకాలను మరింత స్పష్టంగా చెపుతున్నాయి. రాజధాని టోక్యోలో ప్రతి మహిళకు కేవలం 0.99 సంతానోత్పత్తి రేటు నమోదైంది. మరోవైపు వృద్ధుల నిష్పత్తి క్రమంగా పెరుగుతూ ఉంది. దీంతో జపాన్ తన శ్రామిక శక్తిని ,సామాజిక మౌలిక సదుపాయాలను నిలబెట్టుకోవడంలో పెరుగుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 

►ALSO READ | పాకిస్తాన్లో భారీ భూకంపం : 5.8 తీవ్రతతో వణికిపోయిన ఇస్లామాబాద్

తీవ్రతరం అవుతున్న జనాభా సంక్షోభంతో టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం తన ఉద్యోగులకు నాలుగు రోజుల పనిదినాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పని, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసేందుకు, జపాన్ లో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాలు చేసే పేరెంట్స్ మద్దతుగా ఈ ఫ్యాసిలిటీ కల్పించారు. దీంతో పాటు పిల్లల సంరక్షణ పాక్షిక సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఉద్యోగం చేస్తున్న పేరెంట్స్ రోజువారీ పనిగంటల్లో రెండు గంటలు మినహాయింపు ఉంటుంది. ఇది పిల్లల ఆలనాపాలన చూసేందుకు వినియోగించాలి. 

జపాన్ అధికారిక గణాంకాల ప్రకారం..దేశంలో జనవరి నుంచి జూన్ 2024 మధ్య కేవలం 3లక్షల 50వేల 074 జననాలు మాత్రమే నమోదయ్యాయి.ఇది 2023లో ఇదే కాలంతో పోలిస్తే 5.7% తగ్గుదలను సూచిస్తుంది.