మన షూటర్లకు రుచి దొరకట్లేదు..

మన షూటర్లకు రుచి దొరకట్లేదు..

పారిస్‌‌‌‌ : ఒలింపిక్‌‌‌‌ విలేజ్‌‌‌‌లో రుచికరమైన ఆహారం కోసం ఇండియా షూటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షూటింగ్‌‌ ఈవెంట్లు చటౌరాక్స్ లోని రేంజ్‌‌లో జరగడంతో  పారిస్‌‌లోని ఒలింపిక్‌‌ విలేజ్‌‌కు దూరంగా ఉంటున్నారు. అయితే,  మన  షూటర్లుకు చటౌరాక్స్‌‌లో ఇండియన్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ లభించడం లేదు. దీంతో కొందరు స్థానిక సౌత్‌‌‌‌ ఏషియా రెస్టారెంట్లపై ఆధారపడుతుండగా

మరికొందరు భోజనం వండుకునే పనిలో పడ్డారు. ఆహారం అనేది జీవించడానికి మాత్రమే అయినా ఏదో ఓ విధంగా కడుపు నింపుకోవడం కోసం ప్రయత్నిస్తున్నామని ఓ షూటర్‌‌‌‌ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్మా చావల్‌‌‌‌కు అవసరమైన సామాను తెచ్చి తన అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోనే వండుకున్నానని పిస్టల్‌‌‌‌ కోచ్‌‌‌‌ జస్‌పాల్‌‌‌‌ రానా వెల్లడించాడు.