- హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ మాదిరి గానే.. సేమ్ టూ సేమ్.. ఇప్పుడు విజయవాడ హైవేపై ట్రాఫిక్
హైదరాబాద్.. విజయవాడ జాతీయ రహదారి అలా ఇలా లేదు.. మస్త్ రద్దీ.. ఏ రేంజ్లో అంటే హైదరాబాద్ సిటీలో వీక్ డేస్ లో రోడ్లపై ఎలా ట్రాఫిక్ ఉంటుందో.. ఇప్పుడు విజయవాడ హైవేపై సేమ్ టూ సేమ్ అలాగే ఉంది.. సంక్రాంతి సెలవుల్లో ట్రాఫిక్ కామనే అయినా.. ఈసారి మాత్రం ప్రత్యేకం.. ఎందుకంటే రెండో శనివారం, ఆదివారం కలిసొచ్చింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచే అందరూ పల్లెబాట పట్టారు.
శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి లక్షల సంఖ్యలో వాహనాలు ఒక్కసారి ఊర్లకు వెళ్లేందుకు రోడ్డెక్కాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి.. ఉప్పల్ నుంచి.. ఎల్బీనగర్ నుంచి.. ఇలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు అన్నీ ఒక్కసారిగా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర కలిశాయి. అంతే.. ట్రాఫిక్ జాం.. ఏం రేంజ్ లో ఉంది అంటే ట్రాఫిక్.. వీక్ డేస్ లో.. హైదరాబాద్ సిటీలో ఎలా ఉంటుందో.. సేమ్ టూ సేమ్ అలాగే ఉంది ఇప్పుడు హైదరాబాద్.. విజయవాడ జాతీయ రహదారి..
హైదరాబాద్ సిటీ శివార్ల నుంచి విజయవాడ వరకు ఇదే పరిస్థితి. పంతంగి టోల్ గేట్ దగ్గర అయితే 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది.. ఇక వాహనాల వేగం దారుణంగా పడిపోయింది. మామూలు రోజుల్లో.. టోల్ రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత.. ఒక్కొక్కొడు వంద కిలోమీటర్ల స్పీడ్ దగ్గడు.. వాయువేగంతో వెళ్లిపోతుంటారు..
రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి విజయవాడ దుర్గగుడికి.. జస్ట్ మూడున్నర గంటలు అంటే.. మూడున్నర గంటల్లో కొట్టేస్తారు. 100, 110, 120, 130 స్పీడ్ రేంజ్లో.. తొక్కుతారు బండ్లను.. అలా జర్నీ అలవాటు అయిన వాళ్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లను ఈజీగా వెళ్లిపోయే వారు.. ఇప్పుడు జస్ట్ 40 కిలోమీటర్లు మాత్రమే వెళుతున్నారంట. ముందు, వెనక, పక్కన ఇలా మొత్తం వాహనాలే..
Also Read : సంక్రాంతికి ఊరికి పోదాం.. ఇలా సంబరాలు చేద్దాం
మామూలు రోజుల్లో ఆల్టో కారు కూడా వంద తగ్గదు.. ఇప్పుడు బెంజ్ కారు కూడా 40 మీదనే వెళుతుందంట.. హైదరాబాద్.. విజయవాడ మధ్య 300 కిలోమీటర్లు ఇదే పరిస్థితి అంట.. ఎక్కడ చూసినా వాహనాలే.. ఎటుచూసినా వాహనాలే.. ఎక్కడ ఆగాలన్నా గ్యాప్ లేకుండా ఉందంట.. మొత్తానికి సంక్రాంతికి కార్లలో హ్యాపీగా వెళదాం అనుకునే వాళ్లు సైతం.. ట్రాఫిక్ దెబ్బకు నీరసంగా వెళుతున్నారు. మామూలు రోజుల్లో మూడు, నాలుగు గంటల్లోనే వెళ్లిపోయే వారు.. ఇప్పుడు ఆరు, ఏడు గంటల సమయం పడుతుంది..