దేశవ్యాప్తంగా టోల్‌ట్యాక్స్‌ రద్దు

దేశవ్యాప్తంగా టోల్‌ట్యాక్స్‌ రద్దు

దేశంలో లాక్‌డౌన్ సెట్ అయింది. జనమంతా లాక్‌డౌన్‌ను అర్థం చేసుకుంటున్నారు. సిటీల్లో కొన్ని చోట్ల తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ప్రకటించింది. కొన్ని చోట్ల అధికారులే ఆహారం, ఇతర సరుకులు అందజేస్తున్నారు. కేంద్ర రవాణాశాఖ దేశవ్యాప్తంగా టోల్ ట్యాక్స్ వసూళ్లను తాత్కాలికంగా ఆపేసింది.

కరోనా ఎఫెక్ట్‌తో నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టోల్ ట్యాక్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కొన్నాళ్ల పాటు టోల్ ఫీజును రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. అత్యవసర సేవలు, సరుకు రవాణా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ తెలిపారు.

లాక్‌డౌన్ విషయంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. నిత్యావసర వస్తువులకు సంబంధించిన దుకాణాలు 21 రోజుల పాటు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశ ప్రజలకు మూడు నెలల రేషన్ అడ్వాన్స్‌గా ఇస్తామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రాలకు బియ్యం, గోధుమలు పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు 2 రూపాయలకు కిలో గోధుమలు, 3 రూపాయలకు కిలో బియ్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

కరోనాపై యుద్ధాన్ని 21 రోజుల్లోనే గెలుద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. 130 కోట్ల మంది ఇళ్లలోనే ఉండి దేశాన్ని కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పారు. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలని.. వదంతులు నమ్మొద్దని సూచించారు. డాక్టర్లు మనుషుల రూపంలో ఉన్న దేవుళ్లని.. వారంతా తమ ప్రాణాలను లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్నారని అన్నారు.

For More News..

ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో 657కు పెరిగిన కరోనా కేసులు