దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్కి 2898 ఏడీ గురించే చర్చ నడుస్తోంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో హాలీవుడ్ రేంజ్ లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. జూన్ 27న విడుదలైన కల్కి కేవలం ఐదు రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మరో వారంలో రూ.1000 కొట్ల క్లబ్ లో చేరనుంది ఈ సినిమా. దాంతో.. కల్కి సినిమాపై, చిత్ర యూనిట్ పై దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలెబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఈ లిస్టులోకి టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేరిపోయారు. ఇటీవల కల్కి సినిమాను థియేటర్లో చూసిన ఆయన.. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్ సినిమా తీశారు. నాగ్ అశ్విన్ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. థ్యాంక్యూ ప్రియాంక ,స్వప్న. మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష.. అంటూ రాసుకొచ్చారు బ్రహ్మాజీ.
తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు .@nagashwin7 గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను ❤️..thank యూ ప్రియాంక ..స్వప్న ..
— Brahmaji (@actorbrahmaji) July 1, 2024
మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష 🙏🏼 .#Kalki2808AD 🔥@VyjayanthiFilms 🙏🏼
దాంతో బ్రహ్మాజీ చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు బ్రహ్మాజీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్స్ కీ రోల్స్ చేసిన ఈ సినిమాకు సంతోషన్ నారాయణన్ సంగీతం అందించాడు.