ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలో సమాజంలో జరిగే సంఘటనల గురించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు.
అయితే ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత విడాకుల విషయంలో పలు సంచలనం వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వీడియోని షేర్ చేస్తూ "ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా … మంత్రి గారు" అని నమస్కారం చేస్తున్న ఎమోజీలను షేర్ చేశారు.
దీంతో ప్రభాస్ ఫోటోని డీపీగా పెట్టుకున్న ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బ్రహ్మాజీ ట్వీట్ కి అసభ్యకరంగా కామెంట్ చేశాడు. ఇది గమనించిన బ్రహ్మాజీ తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో "నన్ను .. మా అమ్మ ని తిట్టాలంటే మీ స్వంత డీపీ పెట్టి తిట్టండి.. మా ప్రభాస్ దేవుడు.. ఆయన డీపీ పెట్టి నన్ను తిడితే వాళ్ల ఫ్యాన్స్ ఫీల్ అవుతారు.. సరే మీ అమ్మ గారిని అడిగిననని చెప్పండి సార్" అంటూ నమస్కారం పెడుతున్న ఎమోజీ ని షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు.
Nannu .. maa Amma ni thittalante mee OWN DP petti thittandi.. maa prabhas Devudu.. Aayana DP petti nannu thidithe valla fans feel avutharu.. sare Mee Amma garini adiganani Cheppandi Sir 🙏🏼 https://t.co/JhTXt1vmft
— Brahmaji (@actorbrahmaji) October 4, 2024
దీంతో బ్రహ్మాజీ చేసిన ఈ పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు. అలాగే అభిమానం పేరుతో సోషల్ మీడియాలో వ్యక్తుగత దూషణలకు దిగుతున్నారని అలాంటివారికి బ్రహ్మాజీ కరెక్ట్ గా బుద్ది చెప్పారంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే అసభ్యకరంగా కామెంట్ చేసిన ఆ నెటిజన్ చివరికి "తన ఎక్స్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని, ఆ ట్వీట్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని అలాగే కంప్లైంట్ చేశానని" మళ్ళీ బ్రహ్మాజీ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు.