మారిపోయిన మోహన్ బాబు.. హాస్పిటల్ నుంచి ఇంటికెళ్లాక చేసిన మొదటి పని ఇదే..

మారిపోయిన మోహన్ బాబు.. హాస్పిటల్ నుంచి ఇంటికెళ్లాక చేసిన మొదటి పని ఇదే..

హైదరాబాద్: సినీ నటుడు మోహన్ బాబు ఎట్టకేలకు మీడియాకు క్షమాపణ చెప్పారు. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న గొడవలను జల్పల్లి ఫాంహౌస్ వద్ద కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సదరు మీడియా ప్రతినిధికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోహన్ బాబు తన ‘ఎక్స్’ వేదికగా సదరు మీడియా సంస్థకు, మీడియా ప్రతినిధికి క్షమాపణ చెప్పారు.

మంచు కుటుంబంలో గొడవ జరుగుతుండగా.. ఆ దృశ్యాలను చిత్రీకరించబోయిన మీడియాపై నటుడు మోహన్‌బాబు దాడి చేసిన విషయం వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఒక జర్నలిస్ట్ గాయపడ్డాడు. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడ్డ మోహన్‌బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనపై మీడియాను ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆయన మీడియాను ప్రశ్నించారు. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలని ఆడియోలో కోరారు. 

Also Read :- డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

గత నాలుగు రోజులుగా మీడియా ఛానెళ్లు, విలేకర్లు తన ఇంటి ముందు లైవ్ వ్యాన్లు పెట్టుకుని ఉండటం ఎంతవరకూ సబని ఆయన నిలదీశారు. ఈ ఘటనలో తాను దాడి చేశానని చెప్తున్నారే కానీ, సదరు జర్నలిస్ట్ తన ముఖం మీద మైక్ పెట్టిన విషయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మైక్ తెచ్చి తన కన్ను దగ్గర పెట్టారని.. కాసింతయ్యి ఉంటే తన కన్ను పోయేదని మోహన్ బాబు ఆ ఆడియోలో చెప్పుకొచ్చారు.