న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలను పద్మ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి ఇద్దరు ‘పద్మ’ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ- నుంచి వైద్య రంగంలో అందించిన సేవలకు గానూ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని (ఏఐజీ హాస్పిటల్) పద్మ విభూషణ్ వరించింది. ప్రజా వ్యవహారాల విభాగంలో తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ (ఎమ్మార్పీస్ అధ్యక్షుడు) పద్మశ్రీ అవార్డునకు ఎంపికయ్యారు. ఇక.. ఏపీకి చెందిన ఐదుగురు విభిన్న రంగాల్లో సేవలందించినందుకు గానూ పద్మ అవార్డులకు ఎంపిక కావడం గమనార్హం.
కళా రంగంలో సేవలందించినందుకు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణను పద్మ భూషణ్ అవార్డు వరించింది. కళా రంగంలోనే ఆంధ్రప్రదేశ్-కు చెందిన మిరియాల అప్పారావు పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. ఏపీ నుంచి మరో ముగ్గురు కూడా పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ‘పద్మ’ అవార్డులకు ఎంపికైంది వీళ్లే. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల నుంచి ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన ప్రముఖుల జాబితా:
* తెలంగాణ- దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (పద్మ విభూషణ్) (వైద్యం)
* తెలంగాణ- మందకృష్ణ మాదిగ (పద్మశ్రీ) (ప్రజా వ్యవహారాలు)
* ఆంధ్రప్రదేశ్- నందమూరి బాలకృష్ణ (పద్మ భూషణ్) (కళా రంగం)
* ఆంధ్రప్రదేశ్- మిరియాల అప్పారావు (పద్మ శ్రీ) (కళా రంగం)
* ఆంధ్రప్రదేశ్- కేఎల్ కృష్ణ (పద్మ శ్రీ) (సాహిత్యం)
* ఆంధ్రప్రదేశ్- మాడుగుల నాగఫణిశర్మ (పద్మ శ్రీ) (కళలు)
* ఆంధ్రప్రదేశ్- పంచముఖి రాఘవాచార్య (పద్మ శ్రీ) (సాహిత్యం)
పద్మ అవార్డులకు ఎంపికైన క్రీడాకారుల జాబితా:
పీఆర్ శ్రీజేష్ (కేరళ): పద్మభూషణ్
రవిచంద్రన్ అశ్విన్ (తమిళనాడు): పద్మశ్రీ
హర్విందర్ సింగ్ (హర్యానా): పద్మశ్రీ
ఇనివాళప్పిల్ మణి విజయన్ (కేరళ): పద్మశ్రీ
సత్యపాల్ సింగ్ (ఉత్తర ప్రదేశ్): పద్మశ్రీ
Kindly Visit: https://t.co/Yemla9k8XB#PeoplesPadma#Padmaawards2025 pic.twitter.com/Q6iZyd7SAo
— Padma Awards (@PadmaAwards) January 25, 2025