నేను, పవిత్ర ఫిట్ గా ఉన్నాం.. పిల్లల్ని కనొచ్చు.. అయితే

నేను, పవిత్ర ఫిట్ గా ఉన్నాం.. పిల్లల్ని కనొచ్చు.. అయితే

నటుడు నరేష్, పవిత్రతో పిల్లల్ని కనడంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తామిద్దరూ ఫిట్ గా ఉన్నామని, మెడికల్ గా పిల్లల్ని కనోచ్చని చెప్పి అందరికీ షాకిచ్చాడు. రీసెంట్ గా మళ్ళి పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నరేష్, పవిత్ర జంట. మే 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ ఒపీనియన్స్ ను దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్.. పవిత్రతో పిల్లల్ని కనడంపై బోల్డ్ కామెంట్స్ చేసాడు. 

ఈ మేరకు నరేష్ మాట్లాడుతూ.. "నేను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నాం, ఇప్పటికీ మేము మెడికల్‌గా పిల్లలను కనొచ్చు. కానీ ఇప్పుడు మేం పిల్లలను కంటే.. నాకు 80 ఏళ్లు వచ్చే సరికి పిల్లలకు 20 ఏళ్లు వస్తాయి. అందంతా అవసరమా? భార్యభర్తలుగా మాత్రం మేము కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలు, నా పిల్లలు ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటాం. నా దృష్టిలో బ్లడ్‌ రిలేషన్‌షిప్‌ కంటే ఎమోషనల్‌ రిలేషన్‌ షిప్‌ చాలా గొప్పది. 

పవిత్రలో మా అమ్మ విజయనిర్మల గారు కనిపించారు. ఆమె కళ్లు, పవిత్ర కళ్లు ఒకేలా ఉంటాయి. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాం’అని నరేశ్‌ చెప్పుకొచ్చాడు. కాగా.. గత కొంతకాలంగా నరేష్, పవిత్రతో సహాజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్ళితో ఒకటి కానున్నట్లు నరేష్ ప్రకటించాడు కూడా. ఈ నేపధ్యంలో పిల్లల్ని కనడంపై నరేష్ చేసిన ఈ కామెంట్స్ అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.