లావణ్య ఇంటి ముందు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆందోళన

లావణ్య ఇంటి ముందు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆందోళన

రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ మొదలైంది.  ఏప్రిల్ 16న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు  కోకాపేటలోని లావణ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు.  లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ ది అని.. తన కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు అని అన్నారు.  లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సొంత ఇల్లు ఉండి తాము బయట ఎందుకు ఉండాలని నిలదీశారు. తాము నడవలేని స్థితిలో ఉన్నామని.. తమ ఇల్లు తమకు కావాలని న్యాయం చేయాలని కోరుతున్నారు.

అయితే ఇది తన ఇల్లు అని..ఈ ఇంట్లో 15 ఏళ్లుగా ఉంటున్నానని లావణ్య చెబుతున్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు  15 మందిని తీసుకొచ్చి తనపై  దాడి చేయించారని లావణ్య ఆరోపిస్తున్నారు. తన ఇంటి ముందు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని చెప్పారు. ఈ విషయం కోర్టులో ఉందని..అక్కడే తేల్చుకుంటానని లావణ్య అన్నారు.

►ALSO READ | Kesari Chapter2: ‘కేసరి చాప్టర్ 2’ స్పెషల్‌ షో.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎమోషనల్

రాజ్​తరుణ్ పై పెట్టిన కేసులను వాపస్ ​తీసుకుంటానని, అతడి కాళ్లు పట్టుకుని సారీ చెప్తానని లావణ్య 2025 ఫిబ్రవరి 13 నార్సింగిలో  మీడియాతో చెప్పింది. ఒక్క చాన్స్ ఇస్తే కాళ్లు పట్టుకొని రాజ్ తరుణ్ ను క్షమించమని అడుగుతానని చెప్పింది.  రాజ్ తరుణ్ పేరెంట్స్ కి కూడా క్షమాపణలు చెప్తానంది. మస్తాన్ సాయి తనను డ్రగ్స్ కేసులో ఇరికించాడని, చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మస్తాన్ ​సాయి తనతోపాటు పలువురు యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడని, న్యూడ్​ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించాడని ఆరోపించింది. 

వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నానని, తన పోరాటం ఇకపై మస్తాన్ సాయిపైనే ఉంటుందని చెప్పింది. తనను చంపేందుకు చాలా మంది కుట్రలు చేస్తున్నారని, తాను బతికి ఉంటానో.. లేదో.. కూడా తెలియదని, బతికి ఉండగానే రాజ్ తరుణ్ తనకు సారీ చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది.మళ్లీ ఇవాళ రాజ్ తరుణ్ పేరెంట్స్ తో గొడవకు దిగడం ఆసక్తికరంగా మారింది.