సినిమా రివ్యూస్ రాసేవాళ్లు పెంట కన్నా దరిద్రులు : నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ టూ మచ్ కామెంట్స్

సినిమా రివ్యూస్ రాసేవాళ్లు పెంట కన్నా దరిద్రులు : నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ టూ మచ్ కామెంట్స్

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ (Srikanth Iyengar) రివ్యూ రైటర్లపై విరుచుకుపడ్డారు. ఇవాళ శనివారం (అక్టోబర్ 26న) పొట్టెల్ సక్సెస్ మీట్ సందర్బంగా సినిమా రివ్యూస్ రాసేవాళ్లు పెంట కన్నా దరిద్రులు అంటూ దారుణంగా తిట్టాడు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని అంటూ స్టార్ట్ చేసి.. రివ్యూయర్లని దారుణమైన పదజాలంతో తిట్టాడు. ఆయన మాటల్లోనే.. 

'దరిద్రానికి విరోచనాలు వస్తే..రివ్యూ రైటర్ లు పుడతారారట.. డ్రాగ్డ్‌గా ఉందన‍్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. అందుకే ప్రజలున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఉంటారు. సినిమాని ముందుకు తీసుకెళ్తారు. శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి..ప్రాణాలు పనంగా పెట్టి  సినిమాలు తీస్తూనే ఉంటాం' అని శ్రీకాంత్ అయ్యంగర్ తనదైన శైలిలో మాట్లాడాడు.

ALSO READ | Pushpa 2: పుష్ప-2 ది రూల్‌ సరికొత్త రికార్డు.. బిగ్గెస్ట్‌ ఇండియన్‌ సినిమాగా అత్యధిక థియేటర్లో రిలీజ్‌!

అయితే... ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి:

సినిమా ప్రమోషన్స్కు ఈ సినిమా రాతగాళ్లే కావాలి.. సినిమా ఓపెనింగ్ నుంచి బిట్ టూ బిట్.. డే టూ డే అప్ డేట్స్ రాయటానికి ఈ సినిమా రాతగాళ్లే కావాలి.. ధియేటర్లలో సినిమా రిలీజ్ వరకు ఈ రాతగాళ్లే రావాలి.. మూడు, నాలుగు నెలలు తమ తమ సినిమా అప్ డేట్స్ను ప్రమోట్ చేయటానికి.. ప్రేక్షకులకు చేరవేయటానికి ఈ రాతగాళ్లే కావాలి.. సినిమా రిలీజ్ తర్వాత రివ్యూలకూ ఈ రాతగాళ్లే కావాలి..

ఇక సినిమా బాగోలేదు అంటే చాలు.. వీళ్లు వేస్ట్ గాళ్లు.. లుచ్చాగాళ్లూ.. లఫూట్ గాళ్లు.. పెంట కంటే దరిద్రులు.. ఇలా ఉంది సినిమా వాళ్ల మాటలు.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్.. పొట్టేల్ మూవీ మీట్ లో మాట్లాడుతూ సినిమా రివ్యూస్ రాసేవాళ్లపై నోరు పారేసుకున్నారు.. మరింత చులకనగా.. నీచాతి నీచంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..మరి శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన ఈ నీచమైన కామెంట్స్ కి మా అసోసియేషన్ ఎవరికి లేఖ రాస్తుందో అంటూ సినీ జర్నలిస్టులతో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.