టాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనార్ధన్ మృతిపట్ల సీనీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
విజయవాడకు చెందిన వల్లభనేని జనార్ధన్ కు చిన్నప్పటినుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ ఆసక్తితోనే కళాశాల విద్య అనంతరం కళామాధురి పేరుతో నాటక సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో తెలిసినవారి పరిచయలతో ఇండస్ట్రీలోకి ఆడుగుపెట్టారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గజదోంగ ఆయనకు మొదటిచిత్రం. సినిమాల్లో నటిస్తున్న టైమ్ లోనే జనార్ధన్.. దర్శకుడు విజయ బాపినీడు కుమార్తెను వివాహం చేసుకున్నారు.
చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం జనార్ధన్ కు మంచి పేరును తీసుకువచ్చింది. ఇందులో ఆయన హీరోయిన్ సుమలతకి తండ్రిగా నటించి మెప్పి్ంచారు. ఈ చిత్రం తరువాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కేవలం నటుడు గానే కాకుండా జనార్ధన్ దర్శకనిర్మాతగా కూడా రాణించారు. జనార్ధన్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.