బెంగళూరు రేవ్ పార్టీ కేసు: నటి హేమ అరెస్ట్

బెంగళూరు రేవ్ పార్టీ కేసు: నటి హేమ అరెస్ట్

 బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ నటి హేమను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇవాళ ఉదయం నుంచి విచారించిన తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత హేమను జూన్ 4న కోర్టులో హాజరుపరచనున్నారు.

మే  19న రాత్రి బెంగళూర్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్​ సిటీ సమీపంలోని జీఆర్‌‌‌‌ ఫామ్‌‌హౌస్‌‌లో రేవ్‌‌ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రగ్స్, గంజాయితో పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూసెన్స్ చేస్తున్నారనే సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు చేశారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో నటి హేమకు రక్తనమూనాలో పాజిటివ్ వచ్చింది.  

మే 27న విచారణకు హాజరుకావాలని హేమకు పోలీసులు నోటీసులిచ్చారు.అయితే  వైరల్‌‌ ఫీవర్ కారణంగా ఎంక్వైరీకి హాజరుకాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు ఆమె లెటర్ రాశారు. హేమ రాసిన లెటర్‌‌‌‌ను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో  మరోసారి హేమకు నోటీసులిచ్చారు. జూన్ 1న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా విచారణకు హాజరుకాకపోవడంతో విసుగొచ్చిన పోలీసులు మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో  ఇవాళ పోలీసుల ముందు హేమ విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి హేమను విచారించిన  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో హాజరుపర్చనున్నారు.