దయచేసి నా గురించి తప్పుడు ప్రచారాలు ఆపండి: నటి హేమ

దయచేసి నా గురించి తప్పుడు ప్రచారాలు ఆపండి: నటి హేమ

ఆమధ్య బెంగళూరు పరిసర ప్రాంతంలోని ఓ గెస్ట్ హౌజ్ లో రేవ్ పార్టీ సంఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంఘటన తెలిసందే. అయితే ఈ రేవ్ పార్టీలో తెలుగు ప్రముఖ నటి హేమ డ్రగ్స్ తీసుకుందని పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి.

కానీ నటి హేమ మాత్రం తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని అలాగే ఇటీవలే తనకి నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలలో నెగిటివ్ వచ్చిందని ఓ వీడియో ద్వారా తెలిపింది. అయినప్పటికీ నటి హేమపై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. 

ALSO READ | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జిషీట్.. హేమ డ్రగ్స్ తీసుకుంది

దీంతో నటి హేమ తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారంపై మరోసారి స్పందించింది.  ఇందులో భాగంగా తనకి డ్రగ్స్ పరీక్షలలో నెగిటివ్ వచ్చినప్పటికీ "కొందరు కావాలని తనకి పాజిటివ్ వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని" వాపోయింది.  నిజానిజాలు తెలుసుకోకుండా చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాల కారణంగా తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని కాబట్టి ఇప్పటికైనా తనపై నెగిటివ్ ట్రోలింగ్ ఆపాలని కోరింది.

తనకి సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టమని దాంతో తన ప్రాణం పోయినా సరే ఇండస్ట్రీకి తలంపులు తీసుకొచ్చే పనులు ఏమాత్రం చెయ్యనని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ తాను చెప్పే మాటలపై నమ్మకం లేకుంటే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు  ఆరోపణలు చేస్తున్నవారు వచ్చి తన శాంపిల్స్ తీసుకుని చెక్ చేయించుకోవచ్చని నటి హేమ ధీమా వ్యక్తం చేసింది.