Kajal Agarwal: కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కాజల్.. గ్లామర్ ఫొటోస్ వైరల్..

Kajal Agarwal: కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కాజల్.. గ్లామర్ ఫొటోస్ వైరల్..

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయింది. దీంతో సినిమాపరంగా జోరు తగ్గించింది. అయితే నటి కాజల్ అగర్వాల్ ముంబై కి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్చులుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి కాకముందు వరుస టాలీవుడ్ సినిమాల్లో నటించి అలరించిన కాజల్ మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కించుకుని బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

ఇందులో భాగంగా వరుస ఫోటోషూట్లు చేస్తూ గ్లామర్ ఫొటోలకి పోజులిస్తోంది. ఐతే పెళ్లయిన తర్వాత బరువు పెరిగిన కాజల్ అగర్వాల్ మళ్ళీ జిమ్ వర్కవుట్లు, ఫుడ్ డైట్ వంటివి చేస్తూ స్లిమ్ అవుతోంది. దీంతో ఈ ఫోటోలు చుసిన నెటిజన్లు కాజల్ కి మళ్ళీ సరైన హిట్ పడితే నేటితరం యువ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి కాజల్ తెలుగులో కన్నప్ప అనే సినిమాలో పార్వతి దేవి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో తెలుగు హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. కన్నప్ప సినిమా ఏప్రిల్ లో రిలేజ్ కాబోతోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికందర్ అనే సినిమాలో ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటిస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.4 నుంచి రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.