చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసింది.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు...

చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్  చేసింది.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు...

తెలుగు బ్యూటీఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాల్లో నటించే ఆఫర్లు దకించుకుంటూ బిజిబిజీగా గడుపుతోంది. ఇటీవలే నటి మీనాక్షి చౌదరి తమిళ్ లో ప్రముఖ హీరో శింబు హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించే ఆఫర్ దక్కించుకుంది. ఈ చిత్రానికి గతంలో ఓ మై కడవలే (తెలుగులో ఓరి దేవుడా) చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ్ ప్రముఖ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ప్రస్తుతం మీనాక్షి చౌదరి వరుస సినిమా షూటింగులతో బిజిబిజీగా గడుపుతోంది. దీంతో శింబు-అశ్వత్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా 2021లో తెలుగు ప్రముఖ హీరో సుశాంత్ హీరోగా నటించిన "ఇచ్చట వాహనములు నిలపరాదు" చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరించయమైంది. ఆ తర్వాత మాస్ మహారజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మీనాక్షి చౌదరి యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి.

ALSO READ | సినిమాల్లో మహిళలని అలా చూపిస్తున్నారంటూ సీనియర్ హీరోయిన్ సంచలనం..

అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమాతో తన టాలెంట్ ని నిరూపించుకుంది. ఈ సినిమా తర్వాత మీనాక్షి చౌదరి కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో స్టార్ హీరోలైన మహేష్ బాబు (గుంటూరు కారం), విజయ్ (G.O.A.T) తదితరుల చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక విశ్వక్ సేన్ తో కలసి నటిస్తున్న మెకానిక్ రాఖీ, వరుణ్ తేజ్ తో నటించిన మట్కా సినిమాలు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి.

ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 31న ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతోంది. కాగా ఇప్పటికే లక్కీ భాస్కర్ ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కి ముందే ప్రీమియర్ షోలు వేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.