
తెలుగులో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రముఖ హీరోయిన్ ప్రియమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటి ప్రియమణి పలు డ్యాన్స్ షోలు, స్పెషల్ ఈవెంట్స్ జడ్జిగా కూడా వ్యవహరించి బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబ భాధ్యతలు చక్కబెట్టే పనిలో పడటంతో కొంతమేర సినిమాలు తగ్గించింది. ఇటీవలే నటి ప్రియమణి తమ వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది.
అయితే తన భర్త ముస్తఫా రాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇది నచ్చని కొందరు తమ పెళ్ళైన కొత్తలో మతాన్ని ఉద్దేశిస్తూ కించపరిచేలా మాట్లాడేవారని తెలిపింది. ముఖ్యంగా తన భర్త ముస్లీమ్ మతానికి చెందిన వ్యక్తి కావడంతో తమకి పుట్టబోయే పిల్లలు ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా/డాయిష్/ఇస్లామిక్ స్టేట్) లో చేరి టెర్రరిస్టులు అవుతారని కామెంట్లు చేసేవారని ఇది విని చాల బాధ కలిగేది ఎమోషనల్ అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో కూడా చాలామంది తనని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారని తనని అన్నమాటలకి పెద్దగా బాధగా అనిపించలేదని కానీ తన భర్తపై లేనిపోనీ వ్యాఖ్యలు చెయ్యడంతో చాలా బాధగా ఉండేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పెళ్లి అనేది మతాలకి సంబందించినది కాదని.. రెండు మనసులకి సంబంధించిందని ఈ విషయాన్ని తాము బలంగా నమ్మామని అందుకే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా నటి ప్రియమణి బెంగళూరుకు చెందిన ముస్తఫా రాజ్ ని 2017లో వివాహం చేసుకుంది. ముస్తఫా రాజ్ కి కారాన్తక రాష్ట్రంలో వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి. పెళ్ళైన తర్వాత వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆమధ్య హిందీలో రిలీజ్ అయిన జవాన్ సినిమాలో నటి ప్రియమణి కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హాయ్ అయ్యింది. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో తళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే హీరో విజయ్ నటించే చివరి సినిమా ఇదేనని సమాచారం...