
టాలీవుడ్ ప్రముఖ నటి రజిత (Actress Rajitha) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి (76) శుక్రవారం (2025 మార్చి 21న) మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. రజిత పెళ్ళి చేసుకోలేదు. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటున్నారు. శనివారం (మార్చి 22న) ఉదయం 11 గంటలకు ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో విజయలక్ష్మి అంత్యక్రియలు జరగనున్నాయి.
నటి రజిత తల్లిదండ్రులు మల్లెల రామారావు, విజయలక్ష్మి. వీరి స్వస్థలం తూ.గో జిల్లా కొల్ల. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. క్యారెక్టర్ నటులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మీకి చెల్లెళ్లు. రజిత తల్లి మృతి పట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నటి రజిత తెలుగులోనే కాక ఒరియా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 300 పైగా సినిమాల్లో నటించింది. 1998 లో పెళ్ళికానుక సినిమాలో ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది.