Sai Pallavi: ఇక డాక్టర్ సాయి పల్లవి..MBBS పట్టా పుచ్చుకున్న లేడీ పవర్ స్టార్..వీడియో ఇదిగో

సాయి పల్లవి (Sai Pallavi)..ఈపేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.తన నటనతో,వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సాయి పల్లవి. తాజా విషయానికి వస్తే..ఇప్పుడు నటి సాయి పల్లవి..ఇక నుండి డాక్టర్ సాయి పల్లవిగా పిలువబడుతుంది. అదేంటని అనుకుంటున్నారా..సాయి పల్లవి సినిమాల కంటే ముందు నుంచి మెడిసిన్ చదువుతున్న విషయం తెలిసిందే.అంతేకాదు సినిమాల్లోకి వచ్చాక కూడా సాయి పల్లవి మెడిసిన్ చదివును కంటిన్యూ చేసింది.కొన్నాళ్ల క్రితమే సాయి పల్లవి మెడిసిన్ పూర్తిచేసింది.

జార్జియా దేశంలోని Tbilisi State Medical University నుంచి ఆమె మెడిసిన్ చేసింది.ఈ ప్రఖ్యాత యూనివర్సిటీ నుండి ఇటీవలే సాయి పల్లవి MBBS డిగ్రీని అందుకుంది.ఈ సందర్బంగా ప్రస్తుతం తన కాన్వకేషన్ కి సంబంధించిన ఫొటోస్,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమెకు చదువుపట్ల ఉన్న అంకితభావానికి చాలా మంది ప్రశంసలు చూపడంతో పాటు..ఆమెను గర్వంగా డాక్టర్ సాయి పల్లవి అని పిలుస్తున్నారు.కాగా,సాయి పల్లవి గ్రాడ్యుయేషన్ డే రోజు తన కాలేజీలో ఫ్రెండ్స్ తో సరదాగా గడిపింది.మరి సాయి పల్లవి ఫ్యూచర్ లో హాస్పిటల్ కడుతుందా లేదా డాక్టర్ గా పనిచేస్తుందా అనేది చూడాలి.

ALSO READ | Siddharth: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు..సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్

సాయి పల్లవి సినిమా కెరీర్ విషయానికి వస్తే..మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వచ్చిన ఫిదా(Fida) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నేచురల్ బ్యూటీ..తెలుగునాట మంచి క్రేజ్ సంపాదించుకుంది.నిజానికి సాయి పల్లవి సినిమాల కన్నా ఎక్కువ తన వ్యక్తిత్వం తోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.ఎందుకంటే,సాయి పల్లవి ముందు నుండే చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు.రెమ్యునరేషన్ కోసం ఎలాంటి పాత్రలకైనా ఓకే చెప్పే రకం కాదు ఆమెది.ఆమె ఒక సినిమాను ఒకే చేసిందంటే ఆందులో ఖచ్చితంగా ఎదో విషయం ఉండే ఉంటుంది.అలాగే గ్లామర్ షో కు కూడా చాలా దూరంగా ఉంటారు సాయి పల్లవి.అందుకే ఆమెను ఎక్కువ మంది ఇష్టపడతారు.

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు నాగ చైతన్య తండేల్ మూవీతో పాటు బాలీవుడ్ లో రామాయణ వంటి భారీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. ఇక తమిళంలో అమరన్ అనే మూవీ చేస్తుంది.