
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసిటిస్ వ్యాధి కారణంగా కొంతకాలంపాటూ సినిమా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చింది. ఇటీవలే మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఓ నేషనల్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇందులోభాగంగా తాను మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాను. యాక్టింగ్ నా ఫస్ట్ లవ్ అని తెలిపింది. ఇక తాను నటిస్తున్న 'రక్త బ్రహ్మండ్' గురించి మాట్లాడుతూ ఈ వెబ్ సీరీస్ ని రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డి.కె తెరకెక్కిస్తున్నారు... ఇందులోఆదిత్య రాయ్ కపూర్ , అలీ ఫజల్ మరియు వామికా గబ్బి నటిస్తున్నారని ఇది కచ్చితంగా యాక్షన్-ఫాంటసీ సిరీస్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కూడా స్పందిస్తూ లవ్ లైఫ్ ని ప్రైవేట్ గా ఉంచాలనుకుంటున్నని అందుకే ఇక నుంచి ఎక్కడా దీని గురించి ప్రస్తావించదలుచుకోలేదని స్పష్టం చేసింది. కానీ తన ప్రియుడెవరనేది మాత్రం చెప్పలేదు. దీంతో సమంత ప్రేమ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read :- నాని ది ప్యారడైజ్ నుంచి "రా స్టేట్మెంట్"
ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య నటి సమంత కేవలం సినిమాల్లోనే కాదు వెబ్ సీరీస్ లలో కూడా నటించేందుకు ఒకే చెబుతోంది. అయితే ఈమధ్య సమంత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై దృష్టి సరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సంచారం.