Samantha: ర్యాగింగ్ తట్టుకోలేక స్టూడెంట్ మృతి.. వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పందించిన సమంత..

Samantha: ర్యాగింగ్ తట్టుకోలేక స్టూడెంట్ మృతి.. వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పందించిన సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో సమాజంలో జరిగే సంఘటనల గురించి కూడా స్పందిస్తూ ఉంటుంది. అయితే జనవరి 15 కేరళలో రాష్ట్రంలో ఓ విద్యార్ధి పాఠశాలలో సీనియర్లు చేసే ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఇదే విషయంపై నటి సమంత తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది. 

ఇందులో భాగంగా తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ స్టోరీని షేర్ చేసింది. ఇందులోభాగంగా "మనం 2025 సంవత్సరంలో ఉన్నప్పటికీ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేసిన పనికి అనవసరంగా ఎంతోమంచి భవిష్యత్  ఉన్న స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. ఇది చాలా బాధాకరం. పోలీసులు ఈ కేసుని లోతుగా పరిశిలించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నా. ఇలా చేయడం వలన భావితరాలకి మంచి చేసినవాళ్లమే కాకుండా భయంతో ఉన్న స్టూడెంట్స్ కి ధైర్యం చెప్పినవాళ్లమవుతాం. అలాగే కాలేజీలలో ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించి ఈ సమస్యని ఎదుర్కుంటున్న స్టూడెంట్స్ ధైర్యంగా ముందుకొచ్చి స్పందించే విధంగా చర్యలు తీసుకుని భాదితులకు అండగా నిలబడాలని" స్టోరీ షేర్ చేసింది. 

ALSO READ | Sai Pallavi: హాస్పిటల్ లో సాయి పల్లవి.. ఏమైందంటే..?

దీంతో సమంత చేసిన ఈ పని కి నేషజన్లు అభినందిస్తున్నారు. అలాగే ఎంతోమంది యువత తమ భవిష్యత్ కోసం కష్టపడి చదవాలని వస్తుంటారని, కానీ ఈ ర్యాగింగ్ పెనుభూతం కారణంగా వారి జీవితాలు ఆదిలోనే ముగిసిపోతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. అలాగే కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పోలీసులు మేల్కొని ర్యాగింగ్ ని పూర్తిగా నిర్మొలించేందుకు చర్యలు తీసుకోవాలని కొందరు స్టూడెంట్స్ కోరుతున్నారు.

కేరళకు చెందిన 15 ఏళ్ల విద్యార్థి ప్రముఖ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నాడు. ఈ క్రమంలో కొందరు తోటి విద్యార్థులు, సీనియర్లు తరచుగా ఈ విద్యార్థిని ర్యాగింగ్ చేసేవారు. అయితే ఈ మధ్య ఈ ర్యాగింగ్ మరింత ఎక్కువడంతో భరించలకేపోయిన విద్యార్ధి జనవరి 15న స్కూల్ నుంచి ఇంటికిరాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధితుడి తల్లి కొచ్చి పోలీసులకి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.