స్కిన్ కేర్ టిప్స్ చెబుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.

స్కిన్ కేర్ టిప్స్ చెబుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.

టాలీవడ్ స్టార్ హీరోయిన్ సమంత తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ మధ్య నటి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తన చిత్రాలకి సంబంధించిన సినీ అప్డేట్స్ తోపాటూ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. 

ఈ క్రమంలో తన స్కిన్ కేర్ మరియు గ్లో కి సంబందించిన విషయాలను నెటిజన్లతో పంచుకుంది. ఇందులో భాగంగా తాను అనారోగ్యం పాలైన సమయంలో మరియు బలమైన మందులను తీసుకోవలసి వచ్చినప్పుడు ముందుగా తన చర్మం ఇబ్బంది పడేదని తెలిపింది.

దీంతో పికో లేజర్, రెడ్ లైట్ థెరపీ, లింఫాటిక్ డ్రైనేజ్ కి సంబందించిన ఫేషియల్స్, వంటివి ఉపయోగించినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. కాంతివంతమైన చర్మం సన్ ప్రొటెక్షన్, హైడ్రేషన్ వంటివాటితోపాటూ మంచి పోషకాహారం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. 

అలాగే Take20 పాడ్ కాస్ట్ ద్వారా తన నుండి చర్మ సౌందర్యానికి సంబందించిన టిప్స్  తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలని కోరింది.