Sonia Singh: కాస్ట్ లీ బెంజ్ కారు కొన్న విరూపాక్ష బ్యూటీ... రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Sonia Singh: కాస్ట్ లీ బెంజ్ కారు కొన్న విరూపాక్ష బ్యూటీ...  రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఒకప్పుడంటే ప్రీమియం కార్స్ అంటే ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్స్ సినీ ప్రొడ్యూసర్లు తదితరులకే ఉండేవి.. కానీ ఇప్పుడు అందరూ కార్లు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ ఇలా కాస్ట్ లీ కార్లు కొనేస్తున్నారు.. తాజాగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ సోనియా సింగ్ కాస్ట్ లీ మెర్సిడెస్ బెంజ్ కారు కొన్నది.. 

పూర్తి వివరాల్లోకి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ షో రూమ్ లో దాదాపుగా రూ.60 లక్షల పై చిలుకు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ కారుని కొన్నది. ఈ విషయాన్ని సోనియా సింగ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసి పంచుకుంది. అంతేకాదు ఇది తన డ్రీమ్ కార్ అని.. ఈ కార్ కొనడం కోసం చాలా కష్టపడ్డామని తెలిపింది. దీంతో అభిమానులు సోనియా సింగ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే సోనియా సింగ్ కారు కొన్న తర్వాత పూజ చేయించిన తన భర్తతో కలసి రైడ్ కి వెళ్ళింది.

ALSO READ | PradeepRanganathan: దళపతి విజయ్ను కలిసిన డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఎందుకో తెలుసా?

ఈ విషయం ఇలా ఉండగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చిన సోనియా సింగ్ మొదట్లో పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలలో నటించేది. కానీ విరూపాక్ష సినిమాలో ఫుల్ లెంగ్త్ విలేజ్ గర్ల్ రోల్ లో నటించిన తర్వాత ఒక్కసారిగా సోనియా సింగ్ కెరీర్ మారింది. ప్రస్తుతం హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తోంది.