అది బేసిక్ నీడ్.. కమిట్మెంట్ అడగడంలో తప్పేముంది: అనసూయ

అది బేసిక్ నీడ్.. కమిట్మెంట్ అడగడంలో తప్పేముంది: అనసూయ

టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి అనసూయ ఇటీవలే ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఇందులో భాగంగా సినీ ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలు ఆడియన్స్ తో పంచుకుంది. ఈ క్రమంలో హోస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎవరైనా కమిట్మెంట్ అడిగారా అని ప్రశ్నించాడు.  దీంతో అనసూయ ఈ విషయంపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ వరల్డ్ లో ఎక్కువగా ఉంటుందని ఎందుకంటే ఇక్కడ పనిచేసేవాళ్ళు కొంతమేర అందంగా ఉంటారని దీంతో  ఆటోమేటిక్ గా ఇతరులు అట్రాక్ట్ అవుతారని కానీ ఎస్ లేదా నో చెప్పడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తనని కూడా కొందరు డైరెక్టర్లు, హీరోలు నన్ను కమిట్మెంట్ అడిగారని  కానీ సింపుల్ గా నో చెప్పి అక్కడితో ఎండ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంక ఆ టాపిక్ గురించి మాట్లాడను.. ఆలోచించనని తెలిపింది. కమిట్మెంట్ అడగడంలో తప్పు లేదని కానీ ఆ సందర్భంలో మనం ఎలా రియాక్ట్ అవుతామనేదే ముఖ్యమని తెలిపింది.

కమిట్మెంట్ కి నో చెప్పడంతో అవకాశాలు కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని కానీ మళ్ళీ నార్మల్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువమంది యువకులు 35 ఏళ్ళ వయసున్న మహిళలకి అబ్బాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ...  సింపుల్ గా అందులో తప్పేముంది.. గాలి నీరు నిద్ర వంటి అవసరాలతోపాటూ సె**క్స్ కూడా బేసిక్ నీడ్ అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.