రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ దుర్మరణం పాలయ్యాడు. తెలుగు సినిమాలు, సీరియల్స్ లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ శివ బుధవారం (నవంబర్ 1) అర్థరాత్రి రాయదుర్గం వద్ద జరిగిన బైక్ యాక్సిడెంట్ లో మృతిచెందాడు. రాయదుర్గం క్రాస్ రోడ్డు నుంచి బీఎన్ ఆర్ హిల్స్ వెళ్తుండగా ఎల్ఐడీసీఏఫీ కంపెనీ దగ్గర బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్ ఢీకొట్టింది. దీంతో శివ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శివ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. 

ALSO READ : గెలిస్తే సీఎం అయ్యే స్థాయి నాది : చిన్నారెడ్డి