నటి జమున మృతదేహానికి ప్రముఖుల నివాళి

నటి జమున మృతదేహానికి ప్రముఖుల నివాళి

ప్రముఖ సీనియర్ నటి జమున ఇవాళ హైదరాబాద్ లో మృతి చెందారు. ఆమె మృతదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వేణు గోపాలచారి, మధుసూదనాచారి, నటి మంచు లక్ష్మి, నటుడు అలీ, మురళీమోహన్, దైవజ్ఞ శర్మ, ఏకే ఖాన్, ఆర్ నారాయణమూర్తి మాదాల రవి, కరాటే కళ్యాణ్, జమున మృతదేహానికి నివాళులర్పించారు.

నటుడు ఆర్ నారాయణ మూర్తి: - "జమునగారు లేకపోవడం ప్రపంచ సినిమాకే తీరని లోటు. ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో సమానంగా నటించింది.- తన జూనియర్స్ కి సపోర్ట్ చేస్తూ.. అందరికి అవకాశాలు ఇప్పించిన గొప్ప నటి.  టైటానిక్ లోలాగే జమున గారు నిండు మనసులు సినిమాలో అప్పట్లోనే నటించింది.- కన్నడ, హిందీ సినిమాల్లోను తన ముద్ర వేసింది.- రాజకీయాలోకి వచ్చి పెన్షన్ ల కోసం ఫైట్ చేసిన గొప్ప వ్యక్తి జమున. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని కేసీఆర్ ని వేడుకుంటున్నాను. జమున పద్మ అవార్డ్స్ అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను" అన్నారు.

మాజీ రాజ్యసభ సభ్యులు డా. టి. సుబ్బరామిరెడ్డి:"సుప్రసిద్ధ బహుభాషా నటీమణి లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు మరణం చిత్ర పరిశ్రము తీరని లోటు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో చింతించాను. వెండి తెరపై సత్యభామ అంటే జమున గారు అనేలా గుర్తుండిపోయారు. ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. ప్రేక్షకలోకంలో స్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. లోక్ సభ సభ్యురాలిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కళాపీఠం తరఫున ఆమెను సమున్నతంగా సత్కరించు కోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను. 
శ్రీమతి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను"  అన్నారు.

నటుడు అలీ: "- జమున గారు లేరు అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ లో బాధపడుతున్నారు.- మూగ మనసులు సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. ఆమె సినిమాలతో పాటు రాజకీయాల్లోను ముందుంది. మా అమ్మకి జమున గారు అంటే ఎంతో ఇష్టం.- ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగితే బాగుండేది. వాళ్ల అబ్బాయి అమెరికాలో ఉండిపోయాడు. అందుకే ఆమె కూతురే దగ్గరుండి అంత్యక్రియలు చేస్తోంది. అందుకే కంటే కూతురిని కనాలి అని ఆరోజే ఆత్రేయ గారు చెప్పారు" అని చెప్పారు.

 మధుసూదన చారి: "-మా కాలం హీరోయిన్ అమె.. అప్పట్లోనే జమున సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టాయి.  టాలీవుడ్ నటులు ఈ మధ్య వరుసగా కాలం చేస్తున్నారు. విజయ నిర్మల, కృష్ణ, కైకాల ఇప్పుడు జమున చనిపోవడం చాలా విచారకరం. చాలా సందర్భంలో ఆమెను కలిశాను. కలిసినప్పుడు గోదారి గట్టుంది అనే పాటపై మాట్లాడే వారు. చిత్రపరిశ్రమకు నటశిఖరం కోల్పోయినం. జమున కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను" అని అన్నారు.

వేణుగోపాల చారి: "-సత్యభామగా జమున ఫేమస్ అయ్యారు. తెలుగు జీవన సాఫల్యం పురస్కారం ఈమధ్యనే ఆమెకు ఇచ్చాము. మహానటి జమున చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని అన్నారు.

కాగా, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహన్ని - ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు.- ఫిల్మ్ ఛాంబర్ లొనే సినీ ప్రముఖులు సంతాపం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. జూబ్లీహీల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు చేయనున్నారు.