టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. దీంతో ఆలు అర్జున్ ని చూసేందుకు సినీ ప్రముఖులు సన్నిహితులు బంజారా హిల్స్ లోని తన ఇంటికి వస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్ తదితరులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ తో కలసి మాట్లాడుతున్న విడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. అయితే డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు. అలాగే అల్లు అర్జున్ కెరీర్ మలుపు తిరగడానికి కారణం సుకుమార్ అని పలు సందర్భాల్లో అల్లు అర్జున్ తెలిపాడు. ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో పుష్ప 2 రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read : అల్లు అర్జున్ ఖైదీ నంబర్ వెనుక ఇంత స్టోరీ ఉందా..?
అయితే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలసి బన్నీ ఇంటికెళ్లి పరామర్శించాడు. అలాగే ప్రముఖ డైరెక్టర్లు కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు దిల్ రాజు, అభిషేక్ నామ, తదితరులు అల్లు అర్జున్ ని కలిశారు.