టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ.. అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణల కేసు వరుస ట్విస్టులతో సాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ లేడీ కోరియోగ్రాఫర్ అనీ మాస్టర్ (Anee Master) తాజాగా జానీ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
కొరియోగ్రాఫర్ జానీ కేసు విషయం విని షాక్ అయ్యాను..వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నాను. ఇక అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందుకొచ్చి మాట్లాడదాం అని.. ఈరోజు శుక్రవారం (అక్టోబర్ 18న) పలు విషయాలపై స్పందిస్తున్నట్లు తెలిపారు.
"జానీ దగ్గర నేను రెండేళ్లు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశాను. ఆయనతో పాటు ఇతర దేశాలకు కూడా వెళ్ళాము. జానీ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన అలా చేసే ప్రసక్తి లేదని యానిమాస్టర్ అన్నారు. అయితే, కొరియోగ్రాఫర్ జానీ గొప్ప వ్యక్తి అని మీడియా ముందు చెప్పిన అమ్మాయే.. ఇలా కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని' చెప్పారు.
అంతేకాదు ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య అని తెలియగానే సహాయం చేసే వ్యక్తుల్లో జానీ ముందుంటారు. ఈరోజు అమ్మాయి విషయం అనే ఒక్క కారణంతో.. ఎవరూ స్పందించడం లేదు. అయినా కొరియోగ్రఫీ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వేధింపుల విషయాన్ని ఉపేక్షించదు అని గుర్తుచేశారు.
నిజంగా జానీ తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి.. కానీ జానీ నిరపరాధి అని తేలితే ఏంటి? అని ప్రశ్నించింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్‌గా చెబుతున్నాను.. ఈ ఫీల్డ్‌లో ఎంతో కష్ట పడాలని, తన కెరీర్‌లో తనకు ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదని యానీ పేర్కొంది.
ఇకపోతే జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరం. ఏదేమైనా నేరం రుజువు కాకముందే అవార్డు కమిటీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు.. కనీసం హోల్డ్ లో పెట్టాల్సిందని" అనీ మాస్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.