వందలకి పైగా చిత్రాల్లో నటించి దాదాపుగా 40 ఏళ్లుగా తెలుగు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ సీనియర్ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలియని వారుండరు. అయితే ఈమధ్య పలు వ్యక్తిగత కారణాలతో బ్రహ్మానందం సినిమాల్లో నటించడం తగ్గించేశాడు. దీంతో బ్రమ్మి ఫ్యాన్స్ ఆయన కామెడీని బాగా మిస్ అవుతున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ తో అలరించేందుకు తన కొడుకు గౌతమ్ తో కలసి బ్రహ్మ ఆనందం అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా బ్రహ్మానందం విలేఖర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు.
ఇందులో భాగంగా ఓ విలేఖరి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మీరు చెప్తే చాలామంది డైరెక్టర్లు గౌతమ్ తో సినిమాలు చేసేందుకు ముందుకొస్తారని మీ పలుకుబడిని ఉపయోగించి మీ అబ్బాయిని ఎందుకు స్టార్ ని చేయలేకపోయారని అడిగాడు. దీంతో బ్రహ్మానందం ఈ విషయంపై స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఎవరి రికెమెండేషన్స్ పని చెయ్యవని, అలాగే ఎవరికి ఎం రాసిందో, ఎంత వరకు రాసిందో అదే మనకి జరుగుతుందని అంతేతప్ప మనం ప్రయత్నం చేశామని అనుకున్నవన్నీ కూడా జరగవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే చాలామంది సినీ సెలెబ్రెటీ పెద్దల పిల్లలు ఇండస్ట్రీలో కెరీర్ వర్కవుట్ కాక వదిలేసి ఇతర రంగంలో సెటిల్ అయ్యారని కాబట్టి మనం పుష్ చేసినంతమాత్రాన స్టార్స్ గా ఎదుగుతారనేది అవాస్తవమని అందుకే అవకాశాలకోసం నేను నా పిల్లల్ని రికమెండ్ చెయ్యనని చెప్పుకొచ్చాడు. ఇక తన 40 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎప్పుడూ అవకాశాల కోసం, ఎవరి దగ్గరికీవెళ్లి అడిగే అవసరం రాలేదని కానీ తనవద్దకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడంతోపాటూ న్యాయం చేసానని అందుకే ఇండస్ట్రీలో నాకు లాంగ్ రన్ దక్కిందని తెలిపాడు.
ALSO READ | Pattudala Trailer: అజిత్ పట్టుదల ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ తగ్గిందా..?
గౌతమ్ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో గౌతమ్ నటించిన పల్లకిలో పెళ్లి కూతురు సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా అటు మ్యూజికల్ గా, కమర్షియల్ గా బాగానే వర్కవుట్ అయ్యింది. దీంతో అప్పట్లోనే గౌతమ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇంపాక్ట్ ఉంది. కానీ అనుకోకుండా కెరీర్ లోల్ ఎక్కువగా గ్యాప్ రావడం, ఆ తర్వాత చేసిన మను, చారుశీల, బసంతి, తదితర సినిమాలు ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో గౌతమ్ కెరీర్ కష్టాల్లో పడింది.
ఈ విషయం ఇలా ఉండగా బ్రహ్మా ఆనందం సినిమాలో గౌతమ్, బ్రహ్మానందం తాత, మనవళ్లుగా కనిపించారు. ఈ సినిమాకి నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తుండగా తెలుగులో మసూద, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలు అందించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.