గత ఏడాది టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ షైక్ జానీ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకి పాల్పడిన ఆరోపణలతో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్ అనంతరం షైక్ జానీ తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని కొందరు కావాలనే తనని తప్పుడు కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని మీడియా ముందు పలుమార్లు సంజాయిషీ ఇచ్చాడు.
ALSO READ | NTR: గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రెడీ గాఉండండి..
ఇటీవలే జానీ మళ్ళీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలకి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అయితే జైలుకెళ్లోచ్చిన తర్వాత మొదటి సారిగా ఇటీవలే మళ్ళీ షూటింగ్ కి హాజరయ్యాడు. ఈ షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. అయితే జానీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టగానే సినిమా యూనిట్ గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి ఇచ్చి సెట్స్ లోకి ఆహ్వానించారు. అంతేకాకుండా కేక్ కూడా కట్ చేయించడంతో కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అనంతరం మూవీ యూనిట్ తో సరదాగా గడుపుతూ సాంగ్ కంపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.