R. Narayana Murthy: ఆస్పత్రి నుంచి ఆర్.నారాయణమూర్తి డిశ్చార్జ్

R. Narayana Murthy: ఆస్పత్రి నుంచి ఆర్.నారాయణమూర్తి డిశ్చార్జ్

నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి జూలై 17న అస్వస్థతకు గురైన సంగ‌తి తెలిసిందే. పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన నారాయణ మూర్తి..శనివారం (జూలై 20న) క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన అనంతరం నారాయణమూర్తి..తన ఆరోగ్యం గురించి వివరాలు వెల్లడించారు.

ఆర్ నారాయణ మూర్తీ మాట్లాడుతూ.."దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను పూర్తి ఆరోగ్యంగా కోలుకోవడానికి వైద్య సేవలందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి, అక్కడ ఉన్న డాక్టర్స్ కు మరియు సిబ్బందికి  నా హృదయ పూర్వక ధన్యవాదములు" అని తెలిపారు. అలాగే అనుక్షణం నాక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నానంటూ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఆయన సినిమాల్లో ఇప్పటికీ ఏదో ఒక సమస్యను ఎత్తిచూపుతూ దానిని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఆయన తన సినిమాలకు తానే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా లాభాపేక్షను ఆశించకుండా సినిమాలను నిర్మిస్తున్నారు.

కిందటేడాది యూనివర్సిటీ అనే మూవీని తనదైన శైలిలో తెరకెక్కించి మరోసారి సమాజ దుస్థితిని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఉండే కుల రాజకీయాలు, పేపర్ లీక్స్, నిరుద్యోగం వల్ల విద్యార్థులు ఎంతగా నష్టపోతున్నారనే విషయాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా నారాయణమూర్తి చూపించారు.