తమిళ్ హీరో తళపతి విజయ్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న 69(వర్కింగ్ టైటిల్) కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా విజయ్ 69 సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమా రీమేక్ అని కానీ హీరో విజయ్ రోల్ కొంతమేర డిఫరెంట్ గా ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇది రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు.
ఇటీవలే ఈ రూమర్స్ గురించి ప్రముఖ నటుడు విటివి గణేశన్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఈవెంట్ లో స్పందించాడు. ఇందులోభాగంగా హీరో విజయ్ తనకి మంచి స్నేహితుడని దీంతో భగవంత్ కేసరి సినిమాని 5సార్లు చూశానని ఈ సినిమా ని తన 69 సినిమా గా రీమేక్ చెయ్యాలని ఉందని చెప్పాడని తెలిపాడు. అలాగే ఈ రీమేక్ కి కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాలని ఆయనని అడిగినప్పటికీ అనిల్ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు.
Also Read : బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ
దీంతో అనిల్ రావిపూడి ఈ విషయంపై స్పందిస్తూ తనకి భగవంత్ కేసరి సినిమాని తమిళ్ లో రీమేక్ చెయ్యడం ఇష్టం లేదని అందుకే విజయ్ ఆఫర్ కి నో చెప్పినట్లు క్లారిటీ ఇచ్చాడు. అలాగే విజయ్ కి మరో ఫ్రెష్ స్టోరీ వినిపించినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేదని అందుకే విజయ్ తో సినిమాపై ఆగిపోయిందని తెలిపాడు. దీంతో భగవంత్ కేసరి రీమేక్ పై వినిపిస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ తో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.