తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కొమరి జానయ్య(44) ఆత్మహత్య చేసుకున్నారు. కూకట్‌పల్లి లోని భాగ్య నగర్ కాలనీలో ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్కు ఉరేసుకొని మరణించారు.
సినిమా ఇండస్ట్రీలో జానయ్య 2021లో వచ్చిన GST (గాడ్ సైతాన్ టెక్నాలజీ) అనే హారర్ సినిమాకి డైరెక్టర్గా పని చేశాడు.అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలు ఒక సినిమా డైరెక్టర్ అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడమేంటి? ఏవైనా ఆర్ధిక కారణాల? లేక కుటుంబ సమస్యలా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక డైరెక్టర్ ఇలా హోటల్లో చనిపోవడం పట్ల సినిమా ఇండస్ట్రీలో ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. జానయ్య మృతిపై పలువురు సినిమా వాళ్ళు సంతాపం తెలుపుతున్నారు.