గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పట్టుబడిన నిందితుల వివరాల ఆధారం డొంక కదులుతుంది. నిన్నటి వరకు వ్యాపారవేత్తలు మాత్రమే ఉన్న ఈ కేసు.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వైపు మళ్లుతుంది. రాడిసన్ హోటల్ కు డ్రగ్స్ సప్లయ్ చేసిన అబ్బాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని ఫోన్ కాంటాక్ట్ నెంబర్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ లింక్స్ బయటపడ్డాయి. సినీ డైరెక్టర్ గా పేరు పొందిన జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ పేరు బయటకు వచ్చింది. రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ప్రముఖ వ్యాపారవేత్త వివేకానందతోపాటు డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు.
డ్రగ్స్ పెడ్లర్.. అదే డ్రగ్స్ సప్లయ్ చేసిన అబ్బాస్ స్టేట్ మెంట్ ఆధారంగా.. ఎఫ్ఐఆర్ లో డైరెక్టర్ క్రిష్ పేరును పదో నిందితుడిని చేర్చారు. పార్టీలో క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా.. మిగతా వాళ్లు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలుసా లేదా.. పార్టీలో డ్రగ్స్ ఉన్నాయని తెలుసా లేదా ఇలాంటి విషయాలు అన్నీ బయటకు రావాలంటే క్రిష్ ను విచారిస్తేనే తెలుస్తాయంటున్నారు పోలీసులు. అప్పటి వరకు డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పేరు ఎఫ్ఐఆర్ లోనే ఉంటుంది..
ALSO READ :- మూడోసారీ ప్రధాని మోదీయే.. ఆపే దమ్ము ఎవరికీ లేదు: డీకే అరుణ
కాగా రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ సేవించిన కేసులో మంజీరా గ్రూప్ డైరెక్టర్ గా ఉన్న వివేకానంద్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి హోటల్లో కొకైన్ సేవిస్తున్నారన్న సమాచారంతో మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు సోదాలు చేశారు. అప్పటికే కొకైన్ సేవించిన వివేకానంద్ అతని స్నేహితులు పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పటి వరకు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇందులో ఇద్దరు యువతులు ఉన్నట్లుగా తెలుస్తోంది.