దేవర చిత్రానికి కొరటాల శివ అన్ని కోట్లు తీసుకున్నాడా..?

దేవర చిత్రానికి కొరటాల శివ అన్ని కోట్లు తీసుకున్నాడా..?

ప్రముఖ టాలీవుడ్  డైరెక్టర్ కొరటాల శివ తెలుగులో దేవర -1 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసందే. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడులా కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

దేవర చిత్రంలో బాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన నటీనటులు ఉండటంతో హిందీలో కూడా మంచి రెస్పాన్స్ రావడంతోపాటూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా దేవర చిత్రం ఈ సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ కొరటాల శివ దాదాపుగా రూ.30 కోట్లు అందుకున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రం ఫ్లాప్ తరవాత గత రెండేళ్లుగా దేవర చిత్ర స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడు. 

ALSO READ | దేవర చిత్రంలో నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

దీనికితోడు గతంలో ఎన్టీఆర్ తో తెరకెక్కించిన జనతా గ్యారేజ్ చిత్రం బాక్సాఅఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.ఈ కారణంగానే కొరటాల శివ దేవర చిత్రానికి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా దేవర చిత్రం విడుదలకి ముందే ఓవర్సీస్ లో రికార్డులు నెలకొల్పుతోంది. ఈ క్రమంలో కనీసం ట్రైలర్ కూడా విడుదలకాకముందే 1 మిలియన్ యూఎస్ డాలర్లు కలెక్ట్ చేసింది.