
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన క్రిష్ విత్ర్ డ్రా చేసుకున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులు ప్రముఖులు విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు డ్రగ్స్ కేసులు బయటికి రావడంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.
తొలుగు విచారణకు ఒప్పుకున్న క్రిష్.. తర్వాత పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పిటిషన్ వేశారు. తిరిగి సోమవారం ( మార్చి 4) పిటిషన్ వాపసు తీసుకుంటున్నారు. పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు క్రిష్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే ఇటీవల పోలీసుల విచారణకు డైరెక్టర్ క్రిష్ హాజరయ్యారు.