![డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ డైరెక్టర్ కొడుకు.. ఎవరంటే..?](https://static.v6velugu.com/uploads/2025/02/tollywood-director-n-shankar-son-debut-movie-confirmed_WcBEMJt92H.jpg)
తెలుగులో ఒకప్పుడు శ్రీరాములయ్య, జయం మనదేరా, జై భోలో తెలంగాణ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు ఎన్. శంకర్. తాజాగా ఆయన కొడుకు దినేష్ మహీంద్ర కూడా తండ్రి బాటలోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ట్రైనింగ్ తీసుకుని, స్క్రీన్‌ప్లే విషయంలో పలు కోర్సులను పూర్తిచేశాడు దినేష్ మహీంద్ర.
తన దర్శకత్వంలో త్వరలోనే ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీని రూపొందించనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటులను, టెక్నీషియన్లను కూడా పరిచయం చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఆరెక్స్ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని, ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంగ్స్ రికార్డింగ్ వర్క్ జరుగుతోంది.