టాలీవుడ్ సినీ దర్శకుడు ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్యం అయ్యాడు. మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీ, sVH ప్లాజా లో ఉంటున్న ఓం రమేష్ కృష్ణ సినీ పరిశ్రమలో దర్శకుడిగా చేస్తున్నాడు. అయితే, ఈ నెల జనవరి 4వ తేదిన ఉదయం ఓం రమేష్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని భార్య శ్రీదేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మంగళవారం జనవరి 22న మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అతని భార్య శ్రీదేవి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓం రమేష్ భార్య శ్రీదేవి, కుటుంబ సభ్యులు అతని కోసం వెతికినా ఆచూకీ తెలియలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇన్ని రోజులుగా ఓం రమేష్ కృష్ణ కనిపించకుండా పోవడం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.