ఇక నుంచి రామ్ చరణ్ ఆ సీన్స్ చెయ్యాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి: రాజమౌళి

ఇక నుంచి రామ్ చరణ్ ఆ సీన్స్ చెయ్యాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి: రాజమౌళి

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన "గేమ్ ఛేంజర్" సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గురువారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి హాజరై ట్రైలర్ లాంచ్ చేశాడు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ హీరో రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. 

తాను రామ్ చరణ్ ని మగధీర సినిమా నుంచి చూస్తున్నానని అప్పటికీ ఇప్పటికీ అలాగే తన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్ చరణ్ కి చాలా తేడా ఉందని అన్నాడు. నటనపరంగా ఎంతో పరిణితి చెందాడని ఇంత హైట్స్ కి రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక తనతో కలసి పనిచేసిన ఆర్టిస్టులను వారి రియల్ పేర్లతో కాకుండా ఇతర పేర్లతో పిలుస్తుంటానని దీంతో రామ్ చరణ్ ని ఎప్పుడూ కూడా హీరో అనే పేరుతో మాత్రమే పిలుస్తానని చెప్పుకొచ్చాడు. 

గేమ్ ఛేంజర్ ట్రైలర్ లోని హెలికాఫ్టర్ షాట్స్, ఏడుస్తూ ఫోన్ మాట్లాడే సీన్స్ కచ్చితంగా ఆడియన్స్ ని ఎమోషనల్ గా కట్టిపడేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. చివరిగా సముద్రంలో గుర్రంతో పాటూ ఈదుతున్న సీన్స్ గురించి మాట్లాడుతూ ఇక నుంచి గుర్రంతో కలసి చేసే సీన్స్ ఏమైనా ఉంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలని, ఎందుకంటే వాటిపై అన్ని రైట్స్ నాకే ఉన్నాయని చెబుతూ సరదాగా అందరినీ నవ్వించాడు.

ALSO READ | Dabidi Dibidi Lyrical song: ఊలాలా.. నా మువ్వ గోపాలా.. బాలయ్య మాస్ సాంగ్ మామూలుగా లేదుగా..!

ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ శంకర్  గేమ్ ఛేంజర్ సినిమాని పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. దీంతో ఎమోషన్స్, ఫాథర్ సెంటిమెంట్, రివెంజ్, పాలిటిక్స్ ఇలా ఫుల్ ఫ్యాక్ ఎంటర్టైన్మెంట్ తో అలరించేందుకు సిద్దమవుతున్నాడు. 

ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో రిలీజ్ రోజే దాదాపుగా రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.