Surya kiran: నటి కళ్యాణి మాజీ భర్త, దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నటి కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్(Surya Kiran) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బాల నటుడిగా, సహాయ నటుడిగా 200 లకి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. అక్కినేని సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆతరువాత.. దన 51, రాజుభాయ్, బ్రహ్మాస్త్ర, చాప్టర్ 6 వంటి సినిమాలకు దర్శకుడిగా పనిచేశారు. 

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కూడా పార్టిసిపేట్ చేశారు సూర్య కిరణ్. ఇక నటి కళ్యాణిని పెళ్లిచేసుకున్న సూర్య కిరణ్.. కొన్ని అనివార్య కారణాల ఆమె నుండి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుండి ఒంటరిగానే ఉంటున్న సూర్య కిరణ్ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక సూర్య కిరణ్ మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినిమా ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.