టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్(Surya kiran) కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మార్చ్ 11 సోమవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకుకున్నాయి. దీంతో సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
అయితే ఓపక్క సూర్య కిరణ్ మరణవార్తతో ఇండస్ట్రీ విషాదంలో ఉంటే.. మరోపక్క ఆయన గురించి మరో దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి(AS Ravikumar chaudary) మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రవికుమార్ సూర్య కిరణ్ గురించి మాట్లాడుతూ.. ఒకసారి సూర్య కిరణ్ ను పరిగెత్తించి కొట్టాను అని చెప్పుకొచ్చాడు. రవి కుమార్ తన గురువు సాగర్ గురించి చెప్తూ.. మా గురువు గారికి మందు అలవాటు చేసింది సూర్య కిరణ్. ఆయన్ని మద్యానికి బానిసయ్యేలా చేశాడు. మా గురువుగారిని అలా చూడలేకపోయాను.
ALSO READ :- బంధువుల ఇంటికి వెళ్లొచ్చేలోపే.. 5 తులాల బంగారం, 30 తులాల వెండితో..
అందుకే ఆ భాదతో సూర్య కిరణ్ ను పరిగెత్తించి కొట్టాను అంటూ చెప్పుకొచ్చాడు రవికుమార్. అయితే ఈ వీడియో చాలా కాలం క్రితంది. కానీ, సూర్య కిరణ్ మరణం తరువాత ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.