తిని పెంచమ్మా.. హీరోయిన్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

తెలుగు డైరెక్టర్ హీరోయిన్ పై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లో నటించిన హీరోయిన్ అన్షు అంబానీ.. లేటెస్ట్ గా సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మజాకా’ అనే సినిమాలో కీలక రోల్ లో నటించింది. మన్మధుడు తర్వాత అన్షు అంబానీ మళ్ళీ 23 ఏళ్ళకి తెలుగులో నటిస్తుండటం విశేషం. 

‘ధమాకా’ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రినాథ రావు నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా త్రినాథ రావు మాట్లాడుతూ అన్షుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అందరినీ షాకయ్యేలా చేసింది.

ALSO READ | Game Changer: గేమ్ ఛేంజర్ డే2 కలెక్షన్స్.. రెండో రోజు ఎన్ని వచ్చాయంటే..?

టీజర్ లాంచ్ సందర్భంగా.. హీరోయిన్ గురించి డైరెక్టర్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వైరల్ గా మారాయి. ‘‘మేము ఎప్పుడో చిన్న పిల్లలుగా ఉన్నపుడు.. మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో బొద్దుగా ఆకట్టున్న అలాంటి అమ్మాయి ఒక్కసారిగా కళ్ల ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా. ఇప్పటికీ అలాగే ఉందా.. కొంచె సన్నబడింది.. నేనే చెప్పా.. కొంచెం తిని పెంచమ్మా.. తెలుగుకు అన్నీ కొంచె ఎక్కువ సైజులోనే ఉండాలని చెప్పా.. పర్లేదు కొంచె ఇంప్రూవ్ అయినట్లుంది.’’ అని కావాలనే అన్నాడో.. కామెడీ కోసం అన్నాడో కానీ.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.